అదోక మత్స్యకార గ్రామం.అక్కడ అమ్మవారి జాతర జరుగుతోంది.
భక్తులందరూ స్నానాలు చేసి అమ్మవారి ఆలయం ముందు సాష్టాంగ పడ్డారు.ఇంతలో ఒక దున్నపోతును( Buffalo ) తీసుకువచ్చి వారిని తొక్కిస్తూ నడిపించారు.
ఇదం తా చూస్తున్న వారికి ఆశ్చర్యకరమే అయినప్పటికీ అక్కడి వారికి మాత్రం అది ఆచారం.ఈ ఆచారం పాటించకపోతే గ్రామానికే అరిష్టమని అక్కడ ప్రజలు నమ్ముతారు.
పూర్వం నుంచి మండలంలోని అమీనాబాద్ లో( Aminabad ) పూర్వం నుంచి ఒక ఆచారం కొనసాగుతోంది.మత్స్యకార గ్రామ మైన అమీనాబాద్ లో ఏటా పోలేరమ్మ జాతర( Poleramma Jatara ) నిర్వహిస్తారు.
దీనిలో భాగంగా దున్నపోతును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఉదయం నుంచి గ్రామస్తులు ఉపవాసం ఉంచి అమ్మవారికి పూజలు చేస్తారు.
అనంతరం గరగ నృత్యాల నడుమ దున్నపోతును గ్రామమంతా ఊరేగించి ఆలయం వద్దకు తీసుకువస్తారు.ఉవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి అమ్మవారి ఆలయం ఎదురుగా సాష్టాంగ పడతారు.
వారిమీ దుగా దున్నపోతును నడిపిస్తారు.అలా మూడు పర్యాయాలు దున్నపోతుతో తొక్కించుకుంటారు.
తొక్కడం వల్ల పోలేరమ్మ తల్లి గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు వారి కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ఏటా క్రమం తప్పకుండా ఈ ఆచారాన్ని పాటిస్తుం టారు.
అనంతరం ఆలయంలో అమ్మవారికి పసుపు, కుంకుమలతో భక్తులందరూ విశేష పూజలు చేస్తారు.గరగ నృత్యాలతో రాత్రంతా జాగారం చేస్తారు.
మండలంలో నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చి ఈ వింత ఆచా రాన్ని తిలకిస్తారు.అమీనాబాద్ గ్రామ దేవత పోలేరమ్మ తల్లి తీర్థం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ నక్క మణికంఠబాబు తెలిపారు.
జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అల కరించారు.జాతరను పురస్కరించుకుని వివిదె సాంస్కృతిక కార్యక్రమాలు, గరగ నృత్యాల ఏర్పాటు చేశారు.