తెలుగోడి రుచి చూపించిన అంబటి రాయుడు.. చెన్నై ఆటగాళ్లకి బిర్యానీ పార్టీ ఆతిథ్యం..!

ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యాని( Hyderabad Dum Biryani ) ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే.

 Ipl 2024 Srh Vs Csk Ambati Rayudu Biryani Party To Chennai Super Kings Team Vide-TeluguStop.com

, మొదటిగా రుచి చూసేది బిర్యానీని.అంతలా భాగ్యనగరం బిర్యాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

అందుకే విదేశీయులు కూడా కొంతమంది హైదరాబాద్ కు వస్తే కచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లరు.ఇకపోతే నేడు జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా భాగ్యనగరానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) క్రికెటర్స్ కు తెలుగు రాష్ట్రానికి చెందిన మాజీ అంతర్జాతీయ క్రికెటర్, మాజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన అంబటి రాయుడు( Ambati Rayudu ) బిర్యానీ పార్టీతో ఆతిథ్యం ఇచ్చాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా,( Ravindra Jadeja ) అజింక్యా రహానే,( Ajinkya Rahane ) దీపక్ చాహర్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి లతో పాటు టీం స్టాఫ్ కూడా అందరూ బిర్యాని పార్టీలో సందడి చేశారు.ఇక ఈ వీడియో సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ‘బిర్యాని సూపర్ కుటుంబం’ అంటూ క్యాప్షన్ జత చేసింది.ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాదులోని ప్రసిద్ధ దర్శనీయ స్థలాలను చూసేందుకు వెళ్లారు.

ట్యాంక్ బండ్, చార్మినార్ ఇలా అనేక ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లి సరదాగా గడిపారు.అక్కడ వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయడంతో అవి కూడా వైరల్ గా మారాయి.ఇకపోతే నేడు రాత్రి 7:30 కు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ టీమ్స్ తలపడపోతున్నాయి.సన్ రైజర్స్ ఈ సీజన్ లో మూడు మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్కదాంట్లో మాత్రమే గెలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube