టి 20 వరల్డ్ కప్ కోసం పెరిగిన పోటీ..సెలెక్ట్ అయ్యేది ఎవరు..?

ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ ( IPL season )లో కుర్రాళ్ళ హవ నడుస్తుంది.ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒక యంగ్ ప్లేయర్ ఆ టీం తరఫున అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చి టీం ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Who Will Be Selected For The Increased Competition For The T20 World Cup , T20 W-TeluguStop.com

ఇక లక్నో టీమ్ ని వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిపించిన ‘మయాంక్ యాదవ్’ ( Mayank Yadav )తన అద్భుతమైన బౌలింగ్ పర్ఫామెన్స్ ని చూపిస్తూ జట్టు పైన తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే నిన్న గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ezss టీముల మధ్య జరిగిన భీకరమైన పోరులో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అయిన శశాంక్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ ని విజయతీరాలకు చేర్చాడు.

ఒక దశలో పంజాబ్( Punjab ) ఈ మ్యాచ్ ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు.కానీ అలాంటి సమయంలో వచ్చిన శశాంక్ సింగ్ ( Shashank Singh )ఆకాశమే హద్దుగా ఆడి పంజాబ్ కి అరుదైన విక్టరీని కట్టబెట్టాడు.కేవలం 29 బంతుల్లో 4 సిక్స్ లు, 6 ఫోర్లతో 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా పంజాబ్ విజయంలో కీలక పాత్ర వహించాడు.ఇక ప్రతి ఒక్క మ్యాచ్ కి ఒక్కొక్క యంగ్ ప్లేయర్ హైలైట్ అవుతుంటే తర్వాత జరగబోయే టి20 వరల్డ్ కప్ ( T20 World Cup )కోసం ఎలాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేయాలి అనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ప్లేయర్లు అందరూ మంచి ఫామ్ లో ఉండటం అందరూ రాణిస్తూ ఉండటం వల్ల వీళ్లలో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే ఆలోచనలో అయితే బీసీసీఐ ఉంది…ఇక ప్రస్తుతం సీనియర్ ప్లేయర్లు వాళ్ల సత్తా చాటుతూ అద్భుతంగా ఆడుతుంటే యంగ్ ప్లేయర్లు కూడా వాళ్ళకి పోటీ ఇస్తు ముందుకు సాగడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube