మూడేళ్లలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రమావత్ మధుసూధన్. ఇతని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఒక ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) సాధించాలంటే రేయింబవళ్లు కష్టపడాలి.ఏకంగా 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

 Ramavath Madhusudhan Inspirational Success Story Details, Ramavath Madhusudhan,-TeluguStop.com

అయితే సూర్యాపేట జిల్లా( Suryapet District ) నేరేడుచర్ల మండలానికి చెందిన రమావత్ మధుసూదన్( Ramavath Madhusudhan ) మాత్రం ఏకంగా 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు.నిన్న ఐబీపీఎస్ పీవో( IBPS PO ) ఫలితాలు రిలీజ్ కాగా ఈ ఫలితాల్లో మధుసూదన్ కెనరా బ్యాంక్ లో జాబ్ సాధించారు.

గతంలో మధుసూదన్ ఆర్.ఆర్.బీ, ఐబీపీఎస్, ఎస్బీఐలో పీవో పోస్ట్ లు, ఐడీబీఐ, ఐబీపీఎస్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇతర ఉద్యోగాలు సాధించారు.ప్రస్తుతం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీజీఎల్( SSC CGL ) జాబ్ పై దృష్టి పెట్టానని ఆయన కామెంట్లు చేశారు.

మధూసూదన్ తల్లి నాగమణి స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తుండగా తండ్రి పాండు వ్యవసాయం చేస్తున్నారు.

Telugu Jobs, Canara Bank, Ibps, Story, Nagamani, Nereducharla, Pandu, Ssc Cgl, S

తల్లి ప్రోత్సాహంతో కెరీర్ పరంగా సక్సెస్ సాధించానని మధుసూదన్ పేర్కొన్నారు.ఏడాది పాటు బ్యాంక్ జాబ్ కోసం తీవ్రంగా శ్రమించానని తొలి ప్రయత్నంలో సక్సెస్ రాకపోయినా కృంగిపోకుండా ప్రయత్నించానని ఆయన వెల్లడించారు.తెలంగాణలో గ్రూప్ నోటిఫికేషన్లు( Groups Notification ) రావడంతో ఆ జాబ్ కు రాజీనామా చేసి మళ్లీ సాధన మొదలుపెట్టానని మధుసూదన్ చెప్పుకొచ్చారు.

Telugu Jobs, Canara Bank, Ibps, Story, Nagamani, Nereducharla, Pandu, Ssc Cgl, S

దిల్ సుఖ్ నగర్ లోని ఒక కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలిగానని ఆయన కామెంట్లు చేశారు.భవిష్యత్తులో మధుసూదన్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ప్రిపరేషన్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.సరైన ప్రిపరేషన్ తో లక్ష్యం కోసం కష్టపడితే ఆలస్యంగా అయినా లక్ష్యాన్ని సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రమావత్ మధుసూదన్ ను ఎంతోమంది స్పూర్తిగా తీసుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube