టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Hero Siddu Jonnalagadda ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం సిద్దు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇది ఇలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్(Tillu Square ).గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే.డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి ( Neha Shetty )హీరోయిన్గా నటించిన ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
ఇది ఇలా ఉంటే టిల్లు స్క్వేర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.డీజే టిల్లుతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సిద్దు నుంచి వచ్చిన టిల్లు స్క్వేర్ పై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోను మంచి అంచనాలు ఉన్నాయి.అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
అలాగే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.సితార ఎంటర్టైన్మెంట్ ( Sitara Entertainment )వాళ్ళు టిల్లుతో మరోసారి సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది.
ఏరియాల వారీగా టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నైజాం 8 కోట్లు, సిడెడ్ 3కోట్లు, ఆంధ్రాలో 11 కోట్లు రాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 22 కోట్లు ఇక మొత్తంగా చూసుకుంటే 27 కోట్లు బ్రేక్ ఈవెన్ గా చెప్పవచ్చు.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే కెరియర్ లో మరో సూపర్ హిట్ సినిమా పడినట్టే అని తెలుస్తోంది.ఈ సినిమా బాగుంది అంటూ కామెంట్ చేస్తుండగా మరి కొందరు పరవాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంకొందరు అనుపమను ఈ సినిమాలో అలా చూసి తట్టుకోలేకపోతున్నారు.