సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తూ ఉంటాయి.
ఇక దగ్గుబాటి ఫ్యామిలీ( Daggubati family ) నుంచి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రానా ( Rana )మొదట్లోనే వరుస సినిమాను చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు అంత పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోయాయి.

లీడర్ సినిమా తర్వాత ఆయనకి తమిళ్ డైరెక్టర్ అయిన సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో చేసిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాలో ( Yuganiki Okadu )హీరోగా చేసే అవకాశం అయితే వచ్చింది.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయలేదు.అందువల్లే వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వలేదు.దాంతో కార్తీ ని హీరోగా పెట్టి ఈ సినిమా చేశాడు.ఈ సినిమా తెలుగులో భారీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా కార్తీ కి తెలుగు మంచి ఇమేజ్ ను కూడా తీసుకువచ్చి పెట్టింది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కనుక రానా చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయి ఉండడమే కాకుండా ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసేది.కానీ రానా ఈ సినిమాని తక్కువగా అంచనా వేసి రిజెక్ట్ చేయడం అనేది ఆయన కెరియర్ కి భారీ దెబ్బ పడిందనే చెప్పాలి.

ఈ సినిమాతో గనుక తనని తాను ప్రూవ్ చేసుకుంటే వరుసగా ఆయనకి మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చేది…ఇక మొత్తానికైతే ప్రస్తుతం విలక్షణ నటుడి గా మారి సినిమా ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే బాహుబలి సినిమాలో విలన్ గా నటించిన రానా డిఫరెంట్ క్యారెక్టర్లు పోషించడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాడు.








