Elon Musk : న్యాయపోరాటంలో ఆర్ధిక ఇబ్బందులు .. భారత సంతతి వైద్యురాలికి అండగా నిలిచిన ఎలాన్ మస్క్

2020 వేసవిలో కరోనా వైరస్ ఉధృతంగా వున్న సమయంలో కెనడాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్ కుల్విందర్ కౌర్ గిల్( Dr.Kulwinder Kaur Gill ) ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లు, టీకా ఆదేశాలకు వ్యతిరేకంగా ధైర్యం నిలిచారు.అయితే ఆ సమయంలో ఆమె బహిరంగంగా మాట్లాడిన అభిప్రాయాలకు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో టెస్లా అధినేత , బిలియనీర్ ఎలాన్ మస్క్ గిల్‌కు( Elon Musk ) మద్ధతుగా నిలిచారు.

 Elon Musk Responds To Indian Origin Doctor Who Needs Almost 220k For Legal Fees-TeluguStop.com

న్యాయపోరాటంలో చిక్కుకున్న డాక్టర్ గిల్ చట్టపరమైన రుసుములలో అస్ధిరమైన 3,00,000 కెనడా డాలర్ల చెల్లింపును ఎదుర్కోవాల్సి వచ్చింది.అదృష్టవశాత్తూ ‘‘ఎక్స్ ’’( X ) ఆమె ఖర్చులను భరిస్తానని మద్ధతుగా నిలిచింది.

Telugu Drkulwinder, Elon Musk, Elonmusk, Indian Origin-Telugu NRI

కోవిడ్ లాక్‌డౌన్ ప్రయత్నాలు , టీకాపై డాక్టర్ గిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే కెనడియన్ , అంటారియో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో బహిరంగంగానే విమర్శలు గుప్పించింది.అంతేకాదు .మీడియా నుంచి వేధింపులను కూడా ఆమె ఎదుర్కొన్నారు.ట్విట్టర్ మునుపటి నిర్వహణ ద్వారా సెన్సార్‌షిప్, అంటారియోలోని కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ పరిశోధనలను కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో డాక్టర్ గిల్( Dr.Gill ) వ్యవహారం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ దృష్టికి వచ్చింది.లీగల్ ఫీజులు చెల్లించడానికి భారతీయ సంతతికి చెందిన వైద్యుల క్రౌడ్ ఫండింగ్ ప్రచారం గురించి ఆయన తెలుసుకున్నారు.

ఆపై కుల్విందర్‌కు సహాయం చేస్తానని వాగ్థానం చేశారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.‘‘ ఎక్స్ ఇప్పుడు గిల్ ప్రచారానికి నిధులు సమకూర్చడానికి కట్టుబడి వుంది.3,00,000 డాలర్ల తీర్పు.చట్టపరమైన బిల్లులను కవర్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ’’ మస్క్ పేర్కొన్నారు.

Telugu Drkulwinder, Elon Musk, Elonmusk, Indian Origin-Telugu NRI

న్యాయపరమైన చర్యలు డాక్టర్ గిల్ ఆర్ధిక స్థిరత్వాన్ని దెబ్బతీశాయి.ఇది ఆమె జీవిత పొదుపును తగ్గించడంతో పాటు గణనీయమైన అప్పుల భారం పడింది.కష్టాలు ఉన్నప్పటికీ , ఆమె తన విశ్వాసాలకు కట్టుబడి వుంది.

తన పరువుకు భంగం కలిగించారంటూ 23 మంది వైద్యులు, జర్నలిస్టులపై గిల్ పరువు నష్టం దావా వేశారు.దురదృష్టవశాత్తూ ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి తసిపుచ్చారు.బహిరంగ వేదికపై తన విమర్శకుల గొంతును అణచివేయడమే ఆమె ఉద్దేశ్యమంటూ న్యాయమూర్తి నిర్థారించారు.ప్రతివాదుల చట్టపరమైన ఛర్చులను భరించాలని గిల్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube