తెలంగాణలో పెండింగ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులపై( Loksabha Congress Candidates ) క్లారిటీ రానుంది.ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.
సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది స్థానాలపై కమిటీ చర్చించి దాదాపు ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది.
ఖమ్మం,( Khammam ) వరంగల్,( Warangal ) నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల ఎంపీ అభ్యర్థులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.కాగా ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.