తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ( BRS MLA Harish Rao )అన్నారు.బోర్లు వేసినా నీళ్లు పడక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారని తెలిపారు.
ప్రజలకు తాగడానికి కూడా మంచినీళ్లు అందడం లేదని చెప్పారు.రైతుబంధు, కరెంట్ సరిగా ఇవ్వకపోవడంతో రైతులపై ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు.
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్( Congress) ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.

రాష్ట్రంలో నీటి నిర్వహణ విధానం సరిగా లేదన్నారు.అకాల వర్షాలతో కూడా రైతులు( Farmers ) నష్టపోయారని తెలిపారు.ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పార్టీ గేట్లు కాదు.
రిజర్వాయర్ల గేట్లు తెరిచి రైతులను ఆదుకోవాలని సూచించారు.







