సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి.కొంతమంది దర్శకులు కొంతమంది హీరోలతో మాత్రమే సక్సెస్ లు కొడతారు.
మిగతా వాళ్ళతో వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా అవి సక్సెస్ అయితే అవ్వవు.అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు.
ముఖ్యంగా ఈ కాంబినేషన్ లో బోయపాటి శీను( Boyapati Srinu ) గురించి చెప్పాలి.ఈయన ఎంతమందితో సినిమాలు చేసిన సక్సెస్ అయితే అవుతాయి.
కానీ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాలంటే మాత్రం మళ్లీ తను బాలయ్య బాబుతో( Balayya Babu ) సినిమా చేయాల్సిందే.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.మూడు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్లు అవ్వడమే కాకుండా ప్రస్తుతం నాలుగో సినిమాను కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు…
ఇక వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సిన డైరెక్టర్ హరీష్ శంకర్.( Director Harish Shankar ) ఈయన పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) చేసిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.అయితే హరీష్ శంకర్ ఈ సినిమా తర్వాత మళ్లి ఆ రేంజ్ లో సక్సెస్ అయితే కొట్టలేకపోయాడు.కాబట్టి ఇప్పుడు మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.
ఇక అందుకే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా చేస్తున్నారు.ఆ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది.ఇక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే విధంగానే కనిపిస్తుంది.ఈ సినిమాతో కనుక సూపర్ హిట్ అందుకున్నట్లయితే వీళ్ళ కాంబినేషన్ కి మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సక్సెస్ కొడితే ఇక ఆయన క్రేజ్ తార స్థాయిలోకి వెళ్లిపోయిందనే చెప్పాలి…
.