సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నామని కమ్యూనిటీ హల్ నిర్మాణ కమిటీ సభ్యుడు పంది జాన్ అన్నారు.గతంలో 9వ,జాతీయరహదారి పక్కనే ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ 65వ, నేషనల్ హైవే విస్తరణలో భాగంగా కోల్పోవడం జరిగిందని,ఆనాటి నుండి నేటి వరకు దళితులు కమ్యూనిటీ హల్ లేక ఇబ్బందులు గురవుతున్నారని వాపోయారు.
గత పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో అధిక సంఖ్యలో ఉన్న దళితులకు కమ్యూనిటీ హాల్ లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం,జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ తీసుకొని మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు.