ఏపీలో 2024 ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తది అన్నది ఆసక్తికరంగా మారింది.2014లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి( TDP Janasena BJP Alliance ) అధికారంలోకి రావడం జరిగింది.ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.2019లో జనసేన వామపక్షాలతో కలిసి పోటి చేయడం జరిగింది.బీజేపీ, టీడీపీ పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి.అయితే ఇప్పుడు మళ్లీ 2014లో మాదిరిగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటంతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారు.భీమవరం, గాజువాక నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయారు.
ఈసారి పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.ఎట్టి పరిస్థితులలో ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.ఇక ఇదే పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున వంగా గీత( Vanga Geetha ) పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వంగా గీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కచ్చితంగా పవన్ పై గెలిచి తీరుతానని పేర్కొన్నారు.పవన్ కాపు అయితే తాను కూడా కాపు ఆడపడుచునే అని అన్నారు.
కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదు.ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేయాలనేది లెక్కగా ఉండాలి.
కాపులంతా 100% నాకు సహకారం అందిస్తారు.నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది అని వంగా గీత స్పష్టం చేశారు.