జీటీఏ వైస్ సిటీ( GTA Vice City ) గేమ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా ఈ యాక్షన్ అడ్వెంచర్ గేమ్ సూపర్ పాపులర్ అయింది.
ఇందులో ప్లేయర్లు ఎలాంటి రూల్స్ పాటించకుండా ఆడేస్తుంటారు ఇక్కడ డ్రైవింగ్( Driving ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు చాలా కంట్రోల్ ఉపయోగించి ఇందులో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.ఎలా డ్రైవ్ చేసినా ఏమవ్వదు.
అందుకే ఇందులో చాలామంది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుంటారు.ఈ వర్చువల్ గేమ్‌లో ప్రతి ప్లేయర్ బ్యాడ్ క్యారెక్టర్ ప్లే చేస్తాడు.
ఆ జ్ఞాపకాలను గేమర్స్ ఇప్పటికీ ఇష్టపడతారు.
అయితే బెంగళూరులో( Bengaluru ) ఒక డ్రైవర్ అసాధారణ రీతిలో తాను ‘వైస్ సిటీ’కి అభిమానినని చూపించాడు.
అతను తన వ్యాన్‌పై “నేను GTA వైస్ సిటీ నుంచి డ్రైవింగ్ నేర్చుకున్నాను” అని ఒక ఫన్నీ హెచ్చరికను ఉంచాడు.ఈ సందేశం ఇతర అభిమానులను నవ్వించింది.
క్రూరంగా డ్రైవ్ చేసే గేమ్‌ను వారికి గుర్తు చేసింది.కానీ నిజజీవితంలో తప్పు చేస్తే పోలీసులు వదలరు.
GTA వైస్ సిటీలో లాగా డ్రై చేస్తా మీరే జాగ్రత్తగా ఉండాలంటూ ఆ డ్రైవర్ హెచ్చరించిన తీరు కొంతమందికి కోపం కూడా తెప్పించింది.

ఈ ఫన్నీ అలర్ట్ బెంగుళూరులో లాంటి నగరంలో కనిపించడం కొత్తవి కాదు.మరోవైపు కొత్త ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో (GTA) 6’ గేమ్ గురించి వార్తలు వస్తున్నాయి.గేమ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ 2023, డిసెంబర్‌లో రిలీజ్ అయింది.
ఇది పెద్ద భవనాలు, చిత్తడి నేలలు, బీచ్‌లతో మయామిలా కనిపించే నగరాన్ని చూపింది.గేమ్ 2025లో విడుదల కానుంది.21 ఏళ్ల క్రితం వచ్చిన ‘వైస్ సిటీ’ తర్వాత గ్రాఫిక్స్ చాలా మెరుగుపడ్డాయి.

కొత్త గేమ్‌లో చాలా డీటైల్డ్ బిల్డింగ్స్, సముద్రంలో వాస్తవిక వేవ్స్ కనిపించాయి.పాత్రలు మరింత వాస్తవికంగా కనిపిస్తాయి.నగరం సజీవంగా అనిపిస్తుంది, ముఖ్యంగా రాత్రి సమయంలో.‘GTA 6’ వీడియో గేమ్ గ్రాఫిక్స్ ఎంత మెరుగ్గా తయారయ్యాయో చూపిస్తుంది.సంవత్సరాలుగా ఈ గేమ్స్ ఎలా మారుతున్నాయో పరిశీలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.
GTA 6′ మనకు పాత రోజులను గుర్తుకు తెచ్చేలా చేస్తుంది.







