తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని ఆరోపించారు.
అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారన్నారు.ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి స్వేచ్ఛ కోరుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని చెప్పారు.
ధర్నా చౌక్ వద్దన్న వారికి కూడా అక్కడ నిరసన తెలిపే అవకాశం ఇచ్చామన్నారు.కేసీఆర్ నయా నిజాంలా వ్యవహారించారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ కు గుర్తుగా టీఎస్ ను తెచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడలనే చాటారని పేర్కొన్నారు.జయ జయహే తెలంగాణకు మన ప్రభుత్వం గౌరవం ఇచ్చిందన్నారు.
టీఎస్ ను టీజీగా మార్చుకున్నామన్నారు.అంతేకాకుండా కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను పీకేస్తున్నామని తెలిపారు.







