Body Heat : ఒంట్లో వేడి ఎక్కువైందా.. ఇలా చేశారంటే ఒక్క దెబ్బతో హీట్ మొత్తం ఎగిరిపోతుంది!

ఒంట్లో వేడి(( Body Heat ) ఎక్కువైదని ఇంట్లో ఎవరో ఒకరు అనడం తరచూ వింటూనే ఉంటాము.ఆహారపు అలవాట్లు, డీహైడ్రేషన్, వాతావరణంలో వచ్చే మార్పులు, జీవన శైలి తదితర కారణాల వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది.

 This Healthy Drink Helps To Remove Excess Heat From The Body-TeluguStop.com

అందులోనూ వేసవి కాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఇబ్బంది పెడుతుంటుంది.ఒంట్లో అధిక వేడి వల్ల విపరీతమైన చెమటలు, కళ్ళు మంటలు, తలనొప్పి, బద్ధకం, కండరాల తిమ్మిరి, వేగవంతమైన హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

దాంతో వెంటనే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు చలువ చేసే ఆహారాలను తీసుకుంటూ ఉంటారు.

Telugu Temperature, Green Moong Dal, Tips, Healthy, Latest-Telugu Health

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కనుక తీసుకున్నారంటే కేవలం ఒక్క దెబ్బతో మీ ఒంట్లో ఉన్న హీట్ మొత్తం ఎగిరిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం వేడి తగ్గించి శరీరాన్ని చల్లబరిచే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న పెసలను ( Mung bean )వాటర్ లో వేసి రెండు సార్లు వాష్ చేసుకోవాలి.

Telugu Temperature, Green Moong Dal, Tips, Healthy, Latest-Telugu Health

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కడిగిన పెసలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి, ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరిపాలు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధమవుతుంది.ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది.మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ డ్రింక్ శరీరంలో అధిక వేడిని పూర్తిగా తొలగిస్తుంది.

పెసలు మరియు కొబ్బరి పాలు కూలింగ్ ప్రాపర్టీస్ ను కలిగి ఉంటాయి.అందువల్ల వీటిని పైన చెప్పిన విధంగా తీసుకుంటే బాడీలో హీట్ మొత్తం ఎగిరిపోతుంది.

పైగా పెస‌ల‌తో చేసుకొనే ఈ డ్రింక్ మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.ఈ డ్రింక్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పలు దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడతాయి.

అలాగే ఈ డ్రింక్ లో ప్రోటీన్ మరియు ఫైబర్ రిచ్ గా ఉంటాయి.అందువల్ల వెయిట్ లాస్ అవ్వాల‌నుకుంటే ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.

అంతేకాదు ఈ డ్రింక్ వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.మరియు ఎముకలు, కండరాలు సైతం బలోపేతం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube