అమెరికాలో హిందూ ఫోబియా( Hinduphobia ) పెరిగిపోయిందని, దీనిపై పోరాడతోన్న హిందూ కమ్యూనిటీ నాయకులు, సంస్థల బృందానికి మద్ధతు తెలిపారు భారత సంతతి యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీథానేదర్( Indian-American Congressman Shri Thanedar ).హిందూ యాక్షన్ నిర్వహించిన సమావేశంలో పలు భారతీయ అమెరికన్ గ్రూపుల ప్రతినిధులు యూఎస్ క్యాపిటల్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీథానేదర్ ప్రసంగిస్తూ .దేశంలో ప్రస్తుతం హిందూ ఫోబియాని చూస్తున్నామన్నారు.ప్రపంచవ్యాప్తంగా మన దేవాలయాలపై దాడులు, హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు.తాను హిందూ కాకస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడానికి ఇది కూడా ఒక కారణమన్నారు.యూఎస్ కాంగ్రెస్‌లో తొలిసారిగా హిందూ సభను కలిగివున్నామని శ్రీథానేదర్ చెప్పారు.ప్రజలు తమ మతాన్ని వారు కోరుకున్న విధంగా ఆచరించడానికి.
భయం, మూర్ఖత్వం, ద్వేషంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.అమెరికాలో ద్వేషానికి చోటు వుండకూడదని.
దీనిపై తాము కాంగ్రెస్‌లో దృష్టి సారిస్తున్నామని శ్రీథానేదర్ తెలిపారు.

హిందూ అమెరికన్ ఫౌండేషన్‌కు చెందిన సుహాగ్ శుక్లా మాట్లాడుతూ.కాలేజీ క్యాంపస్‌లు( College Campuses ) ప్రబలమైన హిందూ వ్యతిరేక పక్షపాతం, ద్వేషాన్ని అనుభవిస్తున్నాయన్నారు.అమెరికాలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా( Hindu Community ) జరిగిన ద్వేషపూరిత నేరాలకు సంబంధించిన కొన్ని ప్రధాన ఘటనలను కూడా సుహాగ్ ప్రస్తావించారు.
గడిచిన రెండేళ్లలో హిందూ వ్యతిరేక ఘటనలు పెరిగాయని గుర్తుచేశారు.మరోవైపు.రెండ్రోజుల క్రితం సిలికాన్ వ్యాలీ( Silicon Valley )లోని ప్రముఖ భారతీయ అమెరికన్ల బృందం.న్యాయశాఖ, ఎఫ్‌బీఐ, పోలీస్ సీనియర్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు కొందరు అమెరికా భూభాగాన్ని ఉపయోగించుకుంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కాలిఫోర్నియాలోని హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై ఈ వారం న్యాయశాఖ, ఎఫ్‌బీఐ( FBI ), స్థానిక పోలీస్ సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశం నిర్వహించింది.

సమావేశంలో పాల్గొన్న పలువురు చెబుతున్న దాని ప్రకారం.భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న వారిపై అమెరికాలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాయని భారతీయ అమెరికన్లు( Indian Americans ) తమ అసంతృఫ్తిని వ్యక్తం చేశారు.కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా చొరవతో హిందూ, జైన ప్రార్ధనా స్థలాలపై ద్వేషపూరిత నేరాల పెరుగుదల సమస్యను పరిష్కరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.దీనికి దాదాపు రెండు డజన్ల మంది ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు.