అభ్యర్థుల ఎంపికపై ఏపీలోని అధికార పార్టీ వైసీపీ తుది కసరత్తు చేస్తుంది.ఈ మేరకు ఈ నెల 16న వైసీపీ( YCP ) అభ్యర్థుల లిస్టును ప్రకటించనుంది.
ఈ క్రమంలోనే పార్టీ అధినేత, సీఎం జగన్ అభ్యర్థుల ఫైనల్ జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.దీంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గ ఆశావాహులు క్యూ కట్టారు.
ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు, రోజా, దాడిశెట్టి రాజా, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు నేతలు సీఎం జగన్ తో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.అదేవిధంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి నేతలను క్యాంపు కార్యాలయానికి పిలిపించిన సీఎం జగన్( CM Jagan ) వారితో వరుస భేటీలు నిర్వహిస్తున్నారని సమాచారం.