Suma Kanakala : లంగా వోణిలో ట్రెడిషనల్ లుక్ లో యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పలు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేసేవారు ఇలా సీరియల్స్ లో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు.

 Latest News Viral About Suma Kanakala-TeluguStop.com

యాంకర్( Anchor ) గా సుమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా యాంకర్ గా ఒకానొక సమయంలో ఏమాత్రం తీరికలేకుండా వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా ఉండే సుమా ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలను పూర్తిగా తగ్గించేశారు అయితే సినిమా ఈవెంట్లతో మాత్రం ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఏదైనా ఒక కొత్త సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమా టీజర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాల నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ థాంక్యూ మీట్ వంటి కార్యక్రమాల వరకు సుమా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.

ఈ విధంగా వరుస సినిమా కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడిపే సుమ సోషల్ మీడియా( Social media )లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇటీవల కాలంలో ఈమె తన ఇంట్లో వారితో కలిసి అలాగే తన టీమ్ అందరినీ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేస్తూ వారితో సరదా వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక సుమ ఇన్నేళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్న ఎప్పుడూ కూడా హద్దు మీరింది లేదు ఈమె ఎంతో సంప్రదాయ బద్దంగా ఒంటినిండా దుస్తులు వేసుకొని ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు.అయితే తాజాగా సుమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగా ఈమె లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాన్ని తలపించేలా ఉన్నటువంటి లొకేషన్ లో ఈమె ఈ ఫోటోషూట్ నిర్వహించారు ప్రస్తుతం ఈ ఫోటోలను సుమా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి.

ఇలా లంగా వోణీలో సుమ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలలో ఈమె వయసు మరింత తగ్గినట్టు అనిపించింది.ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన సమంత జీవితం అనేది నిన్ను వెతుక్కుంటూ రాదని నువ్వే ఒక కొత్త జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ( Jayamma Panchayathi ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ప్రస్తుతం సుమా కుమారుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube