ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
అయితే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న నియోజకవర్గాలలో ఆరు నియోజకవర్గాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఈ ఆరు నియోజకవర్గాలలో ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఏపీలోని ప్రధాన నియోజకవర్గాలలో కుప్పం( Kuppam ) ఒకటి.టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో ఆ పార్టీని ఓడించాలని జగన్ ఎంతో కష్టపడుతున్నారు.
ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం వైసీపీ డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.కుప్పంలో చంద్రబాబు మెజారిటీని అయినా తగ్గిస్తామని వైసీపీ కాన్ఫిడెన్స్ తో ఉంది.
పులివెందుల వైసీపీకి కంచుకోట కాగా పులివెందులలో వైసీపీకి షాకివ్వాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే కుప్పం, పులివెందులలో( Pulivendula ) ఫలితాలను మార్చడం ఎవరి తరం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మంగళగిరిలో లోకేశ్ ను ఓడించాలని వైసీపీ భావిస్తుండగా గుడివాడలో కొడాలినాని( Kodali Nani )ని ఓడించాలని టీడీపీ భావిస్తోంది.ఈ నియోజకవర్గాలలో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయనున్నారు.

పవన్ ను ఓడించాలని వైసీపీ, విజయసాయిరెడ్డిని ఓడించాలని టీడీపీ భావిస్తున్నాయి.2024 ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ఎన్నికల్లో ఏ పార్టీ విజేతగా నిలిచి అధికారం సాధిస్తుందో చూడాలి.
సర్వేలు సైతం ఏపీలో ఏ పార్టీది అధికారం అనే ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేకపోతున్నాయి.ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తేడా చాలా స్వల్పంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







