సాధారణంగా ఇతరులకు సహాయం, దానధర్మాలు చేసేవాళ్లు ధనవంతులై ఉంటారు.అయితే కొంతమంది మాత్రం పేదవాళ్లు అయినా తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సహాయం చేయడానికి అసక్తి చూపిస్తుంటారు.
మంచి మనస్సుతో ఇతరులకు సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.అలా కూలి పనులు చేసే ఒక వ్యక్తి కాలిబాటన నడిచి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు కొని ఇచ్చి వార్తల్లో నిలిచారు.
కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) దేవదుర్గ తాలూకాకు చెందిన ఆంజనేయ యాదవ్( Anjaneya Yadav ) మంచి మనస్సును చాటుకున్నారు.ఆంజనేయ యాదవ్ కూలిపనులు చేయడం ద్వారా ఏకంగా 40,000 రూపాయలు సంపాదించారు.
ఆంజనేయ యాదవ్ విద్యార్థినులు( Students ) రోజూ 4 కిలోమీటర్లు హైస్కూల్ కు నడుచుకుంటూ వెళ్తున్నారని తెలిసి విద్యార్థినులకు మేలు జరగాలని 11 సైకిళ్లను కొనుగోలు చేసి ఇవ్వడం గమనార్హం.

సైకిళ్లను పంపిణీ చేయడం గురించి ఆంజనేయ యాదవ్ మాట్లాడుతూ రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కు వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ కారణంగా కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఈ పిల్లల చదువు మధ్యలోనే ఆగిపోకూడదని సైకిళ్లు పంపిణీ( Cycles Distribution ) చేశానని ఆంజనేయ యాదవ్ పేర్కొన్నారు.ఆంజనేయ యాదవ్ నిజమైన ధనవంతుడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆంజనేయ యాదవ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పిల్లల చదువు కోసం ఈ విధంగా సహాయం చేసే మంచి మనస్సు కొంతమందికే ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆంజనేయ యాదవ్ రాబోయే రోజుల్లో మరెంతో మందికి సహాయం చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మానవత్వాన్ని మించిన మతం లేదని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా ఆ అభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి.
ఆంజనేయ యాదవ్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







