Aishwarya Bhaskaran : తన తల్లి ఫ్రెండ్ అయితే అవమానిస్తే ఊరుకోను : ఐశ్వర్య 

ఐశ్వర్య( Asishwarya )… నటి లక్ష్మి ఏకైక కుమార్తె .తన తల్లి అడుగుజాడల్లోనే నటి అవ్వాలని పెద్దగా కోరిక లేకపోయినా హీరోయిన్ గా మారాల్సి వచ్చింది.

 Aishwarya Bhaskaran : తన తల్లి ఫ్రెండ్ అయిత�-TeluguStop.com

ఒక సినిమా తీసి అమెరికా వెళ్ళిపోయి లాయర్ అవ్వాలనుకుంది ఐశ్వర్య.కానీ సినిమా ఇండస్ట్రీ అలా ఎవరిని వదిలి పెట్టదు కదా.మొత్తానికి ఐశ్వర్య సౌత్ ఇండియాలోనే మంచి హీరోయిన్ గా అలాగే నటిగా సెటిల్ అయింది.ఆమె జీవితంలో తల్లి ఐశ్వర్య కు అలాగే అమ్మమ్మకు ముఖ్య పాత్ర ఉంటుంది.

తన సినిమా జీవితం మొత్తం తల్లి మరియు అమ్మమ్మ సంరక్షణలోనే జరిగింది.వారికి తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోదు, తండ్రిని కాదని తల్లికి నచ్చినట్టుగా నటి అయింది ఐశ్వర్య.

అయితే సినిమా విషయాల్లో మాత్రం తనకు ఏమీ తెలియదు అంటుంది.మా తల్లి కానీ అమ్మమ్మ కానీ తన సినిమాలను ఒప్పుకుంటారని , వారి నిర్ణయం లేకుండా ఏదిజరగదని చెబుతోంది.


ఇంత వయసు వచ్చిన తల్లి చెప్పిన మాట వినడానికి ప్రయారిటీ ఇస్తానని చెబుతున్న ఐశ్వర్య చిన్నతనం నుంచి తల్లి సంరక్షణలోనే పెరిగిన ఎంతో ఆత్మాభిమానంతో( Self Respect ) పెరిగానని చెబుతోంది.ఎంతలా అంటే ఎవరైనా ఒక మాట అన్నా కూడా తప్పు లేకుండా ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోదట.తన తప్పు ఉంటే ఎంత చిన్నవారికైనా క్షమాపణ అడుగుతుందట.అయితే ఒక సందర్భంలో అలా తప్పు చేయకపోయినా కూడా చాలా అవమానాల పడాల్సి వచ్చింది అంట.తనకు ఆత్మాభిమానం చంపుకోవడం ఇష్టం లేక చివరికి ఎంత పెద్ద పాత్ర అయినా కూడా వదిలేసేదట.ఒకసారి కుట్టిపద్మిని( Kutti Padmini ) వంటి సీనియర్ హీరోయిన్ తీసిన ఒక్క సీరియల్లో ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటించమని అడిగిందట.

ఆమె చిన్నప్పటి నుంచి తెలిసిన కారణంతో చేయడానికి ఓకే అందట ఐశ్వర్య.

కుట్టి పద్మిని ఐశ్వర్య తల్లి లక్ష్మి సమకాలీనురాలు.దాంతో తల్లి కూడా ఓకే అనడంతో సీరియల్లో నటించేందుకు ఒప్పుకుందట.కానీ అలా నటిస్తూ వెళ్తుందే కానీ మూడు నెలలైనా కూడా ఒక రూపాయి కూడా పంపించలేదట.

దాంతో ఓసారి ఫోన్ చేసి మూడు నెలల నుంచి డబ్బులు పడలేదు ఆ సంగతి ఏంటో చూడమని చెప్పిందట.దాంతో అదే రోజు కుట్టి పద్మిని సెట్ కి రావడం ఐశ్వర్య పై అందరి ముందే అరిచేయడం జరిగిపోయాయట.

తను అలా తప్పు చేయకపోయినా తనపై అరవడాన్ని ఒప్పుకోలేదు.అదే టైంలో అమ్మమ్మకు( Grand Mother ) ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పగా అంత ఆత్మాభిమానం చంపుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరు అని చెప్పింది అంట.అదే విషయం సదరు నటికి చెప్పి తను వెళ్ళిపోతున్న విషయం చెప్పేసి వచ్చిందట.అలా వెళ్ళిపోకు డబ్బు వస్తోంది తెప్పిస్తున్నానని చెప్పినా కూడా నాకు డబ్బు వద్దు అంటూ వచ్చేసిందట.

ఆ తర్వాత కుట్టి పద్మిని ఐశ్వర్య అంటే తనకు ఎంతో ఇష్టమని ఐ లవ్ యు ఐశ్వర్య అనే ఒక టైటిల్ తో యూట్యూబ్లో 15 నిమిషాల నిడివి గల ఒక వీడియో విడుదల చేసింది.ముందు అలా అరవడం ఎందుకు ఆ తర్వాత ప్రేమ కురిపించడం ఎందుకు.

అందుకే మనుషులను నమ్మడం ఎప్పుడూ మానేశానని చెబుతోంది ఐశ్వర్య

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube