PM Modi Sangareddy Visit : సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన..!

తెలంగాణలో ప్రధానమంత్రి మోదీ( Prime Minister Modi ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు.

 Prime Minister Modis Visit To Sangareddy District-TeluguStop.com

దాదాపు పది నిమిషాల పాటు ఆలయంలో అమ్మవారికి మోదీ పూజలు నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఆలయం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసులు భారీగా మోహరించారు.

అమ్మవారి దర్శనం తరువాత మోదీ సంగారెడ్డికి( Sangareddy ) బయలుదేరనున్నారు.ముందుగా పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప సభలో( BJP Vijaya Sankapla Sabha ) మోదీ పాల్గొననున్నారు.

సభా వేదికగా రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.సంగారెడ్డిలో రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్.హెచ్-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం ఇవ్వనున్నారు.తరువాత సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనగూడ వరకు రూ.1,298 కోట్లతో ఎన్.హెచ్-65 ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube