ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ( Nita Ambani ) తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ( Anant Ambani ) రాధిక మర్చంట్ ( Radhika Merchant ) వివాహ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహం గత మూడు రోజులుగా ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.
వీరి వివాహపు వేడుకలు జామ్ నగర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు క్రికెటర్లు హాజరై సందడి చేశారు.
ఈ క్రమంలోనే అనంత్ అంబానీ రాధిక మర్చంట్( Anant Radhika ) ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా ఈ పెళ్లి వేడుకలలో మిగతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ పెళ్లి వేడుకలకు వచ్చినటువంటి అతిథులందరికీ ఆమె పక్కకు తిప్పనివ్వకుండా చేశారు అంత అద్భుతంగా ఆమె పెళ్లి వేడుకలలో ముస్తాబయి సందడి చేశారు.
తన కుమారుడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన నాట్య ప్రదర్శన( Nita Ambani Dance )తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఈమె నీతా లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్ చేశారు.ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె ధరించిన ఈ డైమండ్ జ్యువెలరీ ఖరీదు ఎంత ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు.
నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు.రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా( Designer Manish Malhotra ) డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది.బోర్డర్‌పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్‌తో స్టన్నింగ్ లుక్ లో కనిపించారు ఇక ఈ చీరకు అనుగుణంగా ఈమె పచ్చ డైమండ్స్( Green Emerlad Diamonds ) తో కూడినటువంటి లాంగ్ హారం ధరించారు అందుకు అనుగుణంగా ఇయర్ రింగ్స్ చేతి గాజులు అలాగే ఫింగర్ రింగ్స్ కూడా ధరించి చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఇక ఈ ఫోటో వైరల్ గా మారడంతో అందరూ కూడా ఈమె జువెలరీ పైనే చర్చలు మొదలుపెట్టారు.పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ.400-500 కోట్లు ఉంటుందని అంచనా.ఇలా తన కొడుకు పెళ్లి వేడుకలలో భాగంగా నీత అంబాని ధరించిన ఈ ఒక్క జ్యువెలరీ సెట్ ఇంత ఖరీదు చేస్తుందని తెలిసి అందరూ షాక్ అయ్యారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.