తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి.( Director SV Krishna Reddy ).
ఈయన చేసిన ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది.ఇక అందులో భాగంగానే ఒకప్పుడు ఆయన చేసిన మావిచిగురు,శుభలగ్నం, వినోదం, ఆహ్వానం లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.
ఇక దాంతోనే ఆయన ప్రేక్షకుల్లో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు.

ఇక ఈయన డైరెక్టర్ గా వేణు తోట్టెంపూడిని( Venu Thottempudi ) హీరోగా పెట్టి సంగీతను హీరోయిన్ గా పెట్టి ఆయన చేసిన బహుమతి సినిమాకి డైమండ్ రత్న బాబు ( Diamond Ratna Babu ) రైటర్ గా పని చేశాడు.అయితే ఒక సీన్ విషయంలో కృష్ణారెడ్డి గారికి రత్నబాబు కి మధ్య ఒక చిన్న గొడవ అయితే జరిగిందట.ఇక దాంతో ఆ టైమ్ కి పేపర్ మీద రాసుకుంటున్న రత్నబాబు కోపంతో పెన్నుని పేపర్ మీదికి విసిరి కొడితే అది పేపర్ కు తగిలి కృష్ణారెడ్డి గారి మొహానికి తగిలిందట.
దాంతో ఆయన ఇంకా సీరియస్ అయ్యారంట ఇక ఈ ఈ మ్యాటర్ ని పెద్దది చేయకుండ కృష్ణారెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అచ్చిరెడ్డి గారు మధ్యలోకి వచ్చి అక్కడ ఉన్న గొడవను సద్దుమణగొట్టినట్టుగా ఒక ఇంటర్వ్యూలో రత్నబాబు తెలియజేశాడు.

ఇక నిజానికి అక్కడ ఎవరిది తప్పు లేకపోయినప్పటికీ ఆ సినిమా సీన్ అనేది సరిగ్గా రాకపోవడంతో ఆ డైరెక్టర్, రైటర్ ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకోవడంతో అలా మిస్ కమ్యూనికేషన్ జరిగిందని ఆ తర్వాత వాళ్లు మళ్లీ చాలా బాగా కలిసిపోయి సినిమా కోసం వర్క్ చేశారని తెలియజేశాడు.ఇక మొత్తానికైతే సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేసినప్పటికీ ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు.








