ఖమ్మం జిల్లా( Khammam District )లో రోడ్డు ప్రమాదం జరిగింది.కల్లూరు మండలం పెద్దకోరుకొండి ( Peddakorukondi )రైతు వేదిక సమీపంలో ఆటో పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా.వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయని తెలుస్తోంది.

కుర్నవల్లి( Kurnavalli )కి చెందిన మిర్చి కూలీలు ఉదయం ఊటుకూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







