WhatsApp : వాట్సప్ లో సరికొత్త అప్ డేట్.. స్టేటస్, ఛానెల్స్ లలో కొత్త ఫీచర్..!

వాట్సప్( WhatsApp ) ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభా వినియోగించే సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫారం.వాట్సప్ తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.

 Latest Update In Whatsapp New Feature In Status Channels-TeluguStop.com

కేవలం మెసేజ్ లు మాత్రమే కాదు స్టేటస్, చానల్స్, కాల్స్, వీడియో కాల్స్ లాంటి అనేక ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది.అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాభాలో దాదాపుగా ఐదు బిలియన్లకు పైగా ప్రజలు వాట్సప్ వినియోగిస్తున్నారు.

యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, సరికొత్త అప్డేట్లను ప్రవేశ పెడుతూ యూజర్ యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తూ ఉంటుంది.

Telugu Channels, Status, Status Preview, Technolog, Whatsapp-Technology Telugu

ఈ క్రమంలోనే తమ వినియోగదారుల కోసం కొత్త అప్డేట్ తీసుకువచ్చింది.స్టేటస్ ప్రివ్యూతో పాటు ఛానల్ జాబితాను రీడిజైన్ స్టేటస్ బార్ ను సరికొత్తగా అభివృద్ధి చేసింది.ప్రస్తుతం ఈ సరికొత్త అప్డేట్ కేవలం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

త్వరలో వాట్సప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.వాట్సప్ వినియోగదారులు రాబోయే యాప్ వెర్షన్ లో రీ డిజైన్ చేసిన స్టేటస్ ట్రైను గమనించవచ్చు.

ట్యాబ్ తెరిచినప్పుడు ట్రై యాక్సెస్ చేయడం చాలా సులభం.అంటే వాట్సప్ లో స్టేటస్ చూడాలంటే వ్యక్తులు షేర్ చేసిన స్టేటస్ పై క్లిక్ చేస్తే గాని ఓపెన్ కాదు.

అయితే కొత్త అప్డేట్ అందుబాటులోకి వస్తే క్లిక్ చేయకుండానే స్టేటస్ చూడొచ్చు.

Telugu Channels, Status, Status Preview, Technolog, Whatsapp-Technology Telugu

వాట్సప్ ఛానల్ యజమాన్యాన్ని బదిలీ చేయడానికి కొత్త ఎంపికను పరిచయం చేసింది.అంటే ప్రస్తుత యజమాని కొత్త అర్హత గల వినియోగదారుని ఎంచుకొని బదిలీ ప్రక్రియను ప్రారంభించడానికి ఈ అప్డేట్ అనుమతి ఇస్తుంది.దీంతో కొత్త యజమాని సెట్టింగ్లు, సమాచారాన్ని నిర్వహించడం, ఛానల్ ని తొలగించడం, ఇతర నిర్వాహకులను తొలగించడం లాంటి నిర్వాహక హక్కులు పొందుతారు.

ఈ సరికొత్త అప్డేట్ అందుబాటులోకి వస్తే వాట్సప్ ఛానళ్లపై మరింత సౌలభ్యాన్ని, నియంత్రణను అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube