తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.మంత్రి కోమటిరెడ్డి,( Minister Komatireddy Venkat Reddy ) మాజీ మంత్రి హరీశ్ రావు( Ex Minister Harish Rao ) మధ్య వాగ్వివాదం చెలరేగింది.
అసెంబ్లీలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించబోమనడాన్ని స్వాగతిస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.
రెండో అపెక్స్ కమిటీ సమావేశంలో కేఆర్ఎంబీ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పలేదన్నారు.కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ ను అడ్డుకోలేదనడం అవాస్తవమని పేర్కొన్నారు.
నదీ జలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు తమకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని తెలిపారు.నల్గొండలో తాము సభ పెట్టినందుకే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చేది లేదని తీర్మానం చేశారని వెల్లడించారు.మరోవైపు కేసీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కలిసి నల్గొండ జిల్లాను నాశనం చేశారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో హరీశ్ రావు, మంత్రి కోమటిరెడ్డికి మధ్య వాగ్వివాదం చెలరేగింది.