జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) అంచనాలకు మించి ఫ్యాన్ బేస్ ఉంది.2024 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలలో జనసేన పోటీ చేయనుంది.జనసేన పార్టీకి( Janasena Party ) ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఇలా విరాళాలు ఇచ్చిన వాళ్లలో కొంతమంది జనసేన టికెట్ కావాలని కోరుతుండటంతో అలా కోరిన వాళ్ల చెక్ లను వెనక్కు ఇచ్చేశారని తెలుస్తోంది.
అలాంటి విరాళాల వల్ల( Donations ) ఒత్తిడి పెరగడంతో పాటు పార్టీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.మొత్తం ఏడుగురు ఇచ్చిన చెక్కులను పవన్ వెనక్కు పంపించారని తెలుస్తోంది.
పవన్ తనకు సినిమాల ద్వారా వచ్చిన పారితోషికాన్ని సైతం జనసేన కోసం, కష్టాల్లో ఉన్న రైతులు, కార్మికుల కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.

ప్రయోజనాలను ఆశించి పార్టీలో చేరేవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వనని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.జనసేన 30 ఎమ్మెల్యే స్థానాలకు అటూఇటుగా పోటీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.బీజేపీ( BJP ) కూడా టీడీపీతో( TDP ) పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి.బీజేపీ, జనసేన 50కు పైగా స్థానాలలో పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

సర్వేల ఫలితాలలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.కోస్తా జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉండగా రాయలసీమలో వైసీపీకి అనుకూలంగా ఉంది.ఈ ఏడాది ఏపీలో పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండగా ఎన్నికలు పూర్తైన తర్వాత పవన్ షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.
పవన్ ఓజీ మూవీ( OG Movie ) ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27న రిలీజ్ కానుంది.







