టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preeth Singh ) ఒకరు.ఈమె కెరటం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చినటువంటి ఈమె అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు.
ఇలా కెరియర్ పరంగా రకుల్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె సౌత్ సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఉన్న సమయంలోనే ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని( Jackky Bhagnani ) నీ ప్రేమించిన సంగతి తెలిసిందే.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని ఈమె బహిరంగంగా తెలియజేశారు.అప్పటినుంచి తన ప్రియుడితో కలిసి ఎంచక్కా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు.
ఇక ఈనెల 21వ తేదీ రకుల్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఇకపోతే రకుల్ మాత్రం పెళ్లి పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈమె తన ప్రియుడితో కలిసి థాయిలాండ్ వెళ్లారు.రకుల్ తన ప్రియుడితో కలిసి థాయిలాండ్ లో బ్యాచిలర్ పార్టీ ( Bachelor Party ) చేసుకున్నారు.
ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీస్ కూడా హాజరు అయ్యారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) కూడా ఈ బ్యాచిలర్ పార్టీలో పాల్గొన్నారు.
ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు.టాలీవుడ్ లో వీళ్ళిద్దరూ రకుల్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.







