వరి( Paddy ) అనేది మన భారతదేశంలో ప్రధాన ఆహార పంట.అయితే ఈమధ్య కాలంలో రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందుల వాడకం విపరీతంగా పెరగడం వల్ల నేల తన సారాన్ని కోల్పోవడంతో పాటు పంట నాణ్యత కూడా దెబ్బ తింటోంది.
అంతేకాదు పెట్టుబడి ఖర్చు కూడా అమాంతం పెరిగిపోతోంది.అయితే పెట్టుబడి వ్యయం తగ్గి ఆశించిన స్థాయిలో అధిక దిగుబడును సాధించాలంటే వరి పంట సాగు చేపట్టడం కంటే ముందు సాగు విధానంపై అవగాహన కల్పించుకోవడం తప్పనిసరి.
ముందుగా ఏ పొలంలో వరి పంట సాగు చేయాలనుకుంటున్నారో ఆ పొలంలోని నేల యొక్క స్వభావం తెలుసుకోవడం కోసం పరీక్షలు చేపించి భూమి యొక్క లోపాలను తెలుసుకోవాలి.వేసవికాలంలో భూమిని లోతు దుక్కులు దున్ని, ఎండపెట్టుకోవాలి.ఆ తర్వాత పచ్చి రొట్ట పైర్లు పెసర, పిల్లి పెసర,( Pilli Pesra ) జనుము లాంటి పంటలు వేసి పూత దశలో ఉన్నప్పుడు బురదలో కలియ దున్ని బురదలో మగ్గనివ్వాలి.
ఇక చీడపీడలను, తెగుళ్ళను తట్టుకునే మేలు రకం వరి విత్తనాలను సాగుకు ఎంచుకోవాలి.విత్తన శుద్ధి చేసిన తర్వాతనే నారుమడిలో విత్తనాలు చల్లుకోవాలి.పొలం, పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి.
భూమి యొక్క స్వభావమును బట్టి ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.వరి పంటలో అధిక దిగుబడులు( High yields ) సాధించాలంటే ఏవైనా తెగుళ్లు లేదా చీడపురుగులు ఆశిస్తే తొలి దశలోనే నివారించాలి.
సరైన పద్ధతిలో నీరు పొలంబడిలో నిలువ ఉండేలా నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి.సరైన పక్వదశ లోకి పంట వచ్చిన తర్వాతనే పంట కోతలు చేపట్టాలి.
వరి గింజలలో తేమశాతం తక్కువగా ఉండేలా ఎండలో ఆరబెట్టుకోవాలి.వరి గింజలలో తేమశాతం తగ్గిన తర్వాత ధాన్యాన్ని గోనే సంచులలో మాత్రమే నింపి నిల్వ చేయాలి.