Prashanth Verma ; రాజమౌళిపై కోపం వచ్చిందంటూ ప్రశాంత్ వర్మ కామెంట్స్.. ఏ విషయంలో అంటే?

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Verma )దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం హనుమాన్( Hanuman ).తేజా సజ్జా( Teja Sajja ) హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

 Prasanth Varma Latest Comments On Rajamouli-TeluguStop.com

ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది.ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.

Telugu Amrita Iyer, Hanuman, Prashanth Verma, Rajamouli, Teja Sajja, Tollywood-M

ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించిన సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ డైరెక్టర్ రాజమౌళి( Director Rajamouli ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ప్రశాంత వర్మ మాట్లాడుతూ.ఆయన మేకింగ్‌ స్టైల్‌ నాకెంతో ఇష్టం.ఆయన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాను.ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే ఛాన్స్‌ కోసం మెయిల్స్‌ పంపించాను.

నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు.టీమ్‌లో ఖాళీ లేదని అన్నారు.

హార్డ్‌వర్క్‌, టాలెంట్‌ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది.

Telugu Amrita Iyer, Hanuman, Prashanth Verma, Rajamouli, Teja Sajja, Tollywood-M

అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు.రాజమౌళి సినిమాలు, మేకింగ్‌ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను పెద్ద హీరోలతో పని చేయడానికి వ్యతిరేకం కాదు.వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుంది.

వాళ్ల కోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలున్నాయి.ఆ తర్వాత డెడ్‌లైన్‌ పెట్టుకుని వర్క్ చేస్తున్నా.

ఒకవేళ టామ్‌ క్రూజ్ వచ్చినా.నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తా అని ప్రశాంత్‌ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube