తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్( Priyanka Jain ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రియాంక ఇటీవలె తెలుగులో ముగిసిన బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే.
బుల్లితెరపై సీరియల్స్ నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మరింత దగ్గర అయింది.ఇకపోతే ఈమె నటుడు శివ్( Shivakumar ) తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

మౌనరాగం సీరియల్ లో ఇద్దరు కలిసి నటించగా అప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది.ఇక అప్పటినుంచి వీరిద్దరూ కలిసి నివసిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక తన బిగ్ బాస్ షో కి( Bigg boss ) వెళ్లకుండా ఉండాల్సింది అంటూ ఎమోషనల్ అయింది.అసలేం జరిగింది.
ప్రియాంక ఎందుకు అలా మాట్లాడింది అన్న వివరాల్లోకి వెళితే.తాజాగా తన తల్లికి సర్జరీ జరిగినట్లు ప్రియాంక తెలిపింది.
ఆమెకి గత కొంతకాలంగా నెలసరి ఎక్కువ అవుతోందట.బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో వయసు పెరుగుతుండడం వల్ల జరిగే మార్పులు అని అనుకున్నారట.

ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన తల్లికి ఈ సమస్య మొదలయిందట.కానీ ప్రియాంకని బిగ్ బాస్ షోలో( Bigg Boss Show ) చూడాలని ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదు.దీనితో తాను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకుండా ఉండి ఉంటే బావుండేదని ప్రియాంక బోరున ఏడ్చేసింది.
తన తల్లిని పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది.అయితే గర్భాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు సూచించారట.
దీనితో తన తల్లికి ఆపరేషన్ చేసేందుకు ప్రియాంక అంగీకరించింది.తన తల్లిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్లే సమయంలో ప్రియాంక మరింత ఎక్కువగా ఏడ్చేసింది.
అయితే సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో ప్రియాంక ఊపిరి పీల్చుకుంది.తానూ బిగ్ బాస్ లోకి వెళ్లకుండా తన తల్లి ఆరోగ్యం పై కేర్ తీసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని ప్రియాంక బాధపడుతోంది.
డిశ్చార్జ్ అయినా తర్వాత తన తల్లిని ఇంటికి తీసుకువెళ్ళింది.







