Trivikram , Sunil : త్రివిక్రమ్ సినిమాలలో సునీల్ మోసపోతున్నాడా.. ప్రాధాన్యత లేని అలాంటి రోల్స్ అవసరమా?

తెలుగు ప్రేక్షకులకు హీరో, కమెడియన్ సునీల్ ( Comedian Sunil )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సునీల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 Trivikram Cheating On Sunil-TeluguStop.com

హీరోగా మాత్రమే కాకుండా కమెడియన్ గా అలాగే ఈ మధ్యకాలంలో విలన్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )సునీల్ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇండస్ట్రీకి రాకముందు కూడా వీరిద్దరూ ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

Telugu Sunil, Tollywood, Trivikram, Trivikram Sunil-Movie

ఆ సంగతి పక్కన పెడితే ఇటీవలే కొత్తగా విలన్ అవతారమెత్తిన సునీల్ ని ఆయన స్నేహితుడు డైరెక్టర్ త్రివిక్రమ్ మోసం చేస్తున్నారా? అంతే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే తివిక్రమ్ సునీల్ కి ఇచ్చిన మాట కోసం ఏవో చిన్న చిన్న పాత్రలకే ఆయన సినిమాల్లో పరిమితం చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.దానికి తోడు త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ క్యారెక్టర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

విలన్ గా పెద్ద సినిమాల్లో నటిస్తున్న సునీల్ త్రివిక్రమ్ సినిమా అనగానే ఆయన నా స్నేహితుడు తన సినిమాలో నాకు మంచి కేరెక్టర్ డిజైన్ చేసి ఉంటాడు అని, త్రివిక్రమ్ ని నమ్మి సినిమా చేస్తున్నాడు.

Telugu Sunil, Tollywood, Trivikram, Trivikram Sunil-Movie

కానీ సునీల్ మాత్రం ఒకటి రెండు సీన్స్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది.ఈ విషయం పట్ల సునీల్ అభిమానులు చాలా వరకు నిరాశ చెందుతున్నారు.ఎన్టీఆర్ తో అరవింద సమేతలో మంచి రోల్ చేసిన సునీల్, ఆ తర్వాత అలా వైకుంఠపురములో( Ala Vaikunthapuram ) సినిమాలో చాలా చిన్న రోల్, అది కూడా ఎలాంటి ప్రాధాన్యత లేని రోల్ లో నటించాడు.

ఇక రీసెంట్ గా గుంటూరు కారంలోను సునీల్ ఇలా వచ్చి అలా మాయమయ్యాడు.చాలా చిన్న ర్పల్ అది చూసాకే సునీల్ స్నేహితుడు అని నమ్మి మోసపోతున్నాడని ప్రేక్షకులు, ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి సినిమాలో కూడా సునీల్ పాత్ర కనీసం రెండంటే రెండు నిమిషాలు కూడా ఉండడం లేదు.మరి రూమ్ మేట్స్, స్నేహితుడు ప్రస్తుతం డౌన్ లో ఉన్నాడు, ఏ రోల్ ఇచ్చినా చేస్తాడు అనుకున్నారో ఏమో.త్రివిక్రమ్ సునీల్ కి మరీ ప్రాధాన్యత లేని పాత్రలు ఇస్తున్నారు.ఈ విషయంలో మాత్రం సునీల్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube