రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ తమిళిసైకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం..!!

జనవరి 26వ తారీకు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు( Republic Day Celebrations ) జరగనున్నాయి.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా రిపబ్లిక్ డేను జరుపుకుంటారు.దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) గణతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉంది.

 Cm Revanth Reddy Invites Governor Tamilisai For Republic Day Celebrations Detail-TeluguStop.com

దాదాపు 14,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ వేడుకలు నిర్వహించే కర్తవ్య్ పధ్ లో( Kartavy Path ) జరిగే వేడుకలకు 77 వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశము ఉందని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీనీ 28జోన్లుగా విభజించిన పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.ఇదే సమయంలో హెల్ప్ డెస్కులు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) గవర్నర్ తమిళిసైనీ( Governor Tamilisai ) వేడుకలకు ఆహ్వానించడం జరిగింది.సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

రిపబ్లిక్ డే వేడుకలను ఆహ్వానించిన సమయంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై కూడా చర్చలు జరపడం జరిగిందట.ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు రెండు రోజులలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube