ఆఫ్ఘనిస్థాన్ (Afghanisthan)లో విమానం కుప్పకూలింది.తోప్ ఖానా పర్వతాల్లోని కురాన్ – మన్ జన్ జిల్లాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మేరకు విమానం (Flight) కూలినట్లు ఆఫ్ఘనిస్థాన్ ధృవీకరించింది.

అయితే కూలిపోయింది భారత విమానం కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) ప్రకటించింది.మొరాకో రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ (Moroccan Registered Aircraft) కూలిందని, అది చిన్న విమానమని వెల్లడించింది.







