బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అమర్ దీప్ చౌదరి( Amar Deep Chowdary ) ఒకరు.ఈయన పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ విధంగా ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు.ఈ కార్యక్రమం మొదట్లో భారీ స్థాయిలో నెగిటివ్ ఎదుర్కొన్నటువంటి అమర్ అనంతరం తన ఆట తీరును మెరుగుపరుస్తూ చివరికి టైటిల్ రేస్ కు చేరుకున్నారు.
ఇక ఈయన ఈ కార్యక్రమంలో రన్నర్ గా బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇక గ్రాండ్ ఫినాలే రోజు అమర్ కారుపై దాడి జరగడం అనంతరం ఈయన ఏ ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా ఉండడం జరిగింది.అయితే ప్రస్తుతం మాత్రం అమర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ గురించి అలాగే తన స్నేహితుల గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు.అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు తన స్నేహితులు తనని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు తన గురించి వచ్చే నెగటివ్ కామెంట్లను తిప్పికొడుతూ తనకు ఎంతో మద్దతుగా నిలిచారు.
అలాంటి వారిలో బుల్లితెర నటుడు మానస్ (Manas) ఆరియనా( Ariyana ) ఒకరు.

అమర్ గురించి మానసి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా తనకు ఓటు వేయాలని చెబుతూ తనని సపోర్ట్ చేశారు.అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్ తన స్నేహితుల గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.కొంతమంది తనని సపోర్ట్ చేయగా మరికొందరు తన హార్ట్ కి చాలా దగ్గర అయిన వారు కూడా తనకు సపోర్ట్ చేయలేదని పైగా వెకేషన్ అంటూ వారి లైఫ్ ఎంజాయ్ చేశారు అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అమర్ తన స్నేహితుల గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.ముఖ్యంగా మానస్, ఆరియానా గురించి అమర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఫ్రెండ్షిప్ అనే దేవాలయంలో కనిపించని దేవుడు మానస్ అయితే కనిపించేలా చేసిన పూజారి అరియాన గుడికి దేవుడు ఎంత ఇంపార్టెంట్ పూజారి కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని మానస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా అమర్ వారిద్దరి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఈయన పట్ల కొంతమంది నెగటివ్ గా స్పందిస్తూ ఆయనని ట్రోల్ చేయగా మరికొందరు మాత్రం చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఈయనని ఎంతగానో ఎంకరేజ్ చేశారు.ఇలా తనని ఎంకరేజ్ చేయడంతోనే బిగ్ బాస్ రన్నర్ గా బయటకు వచ్చారు.
ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతూ ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్న సంగతి తెలిసిందే.







