పెరుగుతున్న గృహ సంక్షోభం, నిరుద్యోగిత మధ్య తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై పరిమితులు విధించాలని కెనడా భావిస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి పరిస్ధితుల్లోనూ విదేశీ విద్యార్ధులకు కెనడా శుభవార్త చెప్పింది.గతేడాది 62,410 మందికి శాశ్వత నివాస హోదా దక్కినట్లు ఇమ్మిగ్రేషన్ డేటా చెబుతోంది.2022లో ఈ సంఖ్య 52,740 వుండగా.ఇప్పుడు ఈ సంఖ్య 9,670 పెరిగినట్లు ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) డేటా తెలిపింది.

ఇమ్మిగ్రేషన్( Immigration ) నిపుణుల ప్రకారం.కెనడా జనాభా పెరుగుదలలో ఇప్పుడు ఎక్కువ భాగం విదేశీ విద్యార్ధులు, శాశ్వత నివాసితులు, తాత్కాలిక విదేశీ కార్మికుల కారణంగా జరుగుతోంది.వృద్ధాప్య కార్మికులను భర్తీ చేయడానికి, కార్మిక అంతరాలను తగ్గించడానికి దేశం వలసదారులకు తలుపులు తెరిచింది.
అయితే ఈ సంఖ్య అనూహ్యంగా పెరగడంతో దేశ వనరులపై ఒత్తిడి కలుగుతోంది.గత వారం ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ( Marc Miller )మాట్లాడుతూ.దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్ధులు, తాత్కాలిక నివాసితుల సంఖ్యను నిశితంగా విశ్లేషిస్తానని పేర్కొన్నారు.పర్మిట్‌లను సంస్కరించడం, శాశ్వత నివాసితులను పరిమితం చేయడం వంటి అంశాలపై తాను ఆలోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ఇంతలో మాంట్రియల్‌కు చెందిన డెస్జార్డిన్స్ సెక్యూరిటీస్ మాత్రం మిల్లర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపింది.కెనడాలోకి తాత్కాలిక కార్మికులు, విదేశీ విద్యార్ధుల రాకను పరిమితం చేస్తే దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.క్యాపిటల్ మార్కెట్ కంపెనీ అంచనాల ప్రకారం.దేశ వాస్తవ జీడీపీలో 0.7 శాతం పడిపోతుందని, తర్వాతి నాలుగేళ్లలో సగటున 1.78 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది.మరోవైపు.కెనడియన్ శాశ్వత నివాసం కావాలనుకునే విద్యార్ధులకు అనేక ప్రత్యామ్నాయాలు వున్నాయి.వాటిలో ది బెస్ట్ అంటే ‘‘ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్’( Express Entry program )’.అంతర్జాతీయ విద్యార్ధులు ప్రతి ఏడాది కెనడాలో శాశ్వత నివాసాన్ని ఎంచుకునేందుకు ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ కేటగిరీలో భారతీయ విద్యార్ధులదే సింహభాగం.







