తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబును రక్షణనిధి కలిసే అవకాశం ఉందని సమాచారం.
టీడీపీలో చేరి తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో రక్షణనిధి ఉన్నారని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో రక్షణనిధికి టికెట్ లేదని వైసీపీ అధిష్టానం చెప్పిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన గత కొన్ని రోజులుగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అసంతృప్తిలో ఉన్న రక్షణనిధికి పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తాను పార్టీలో కొనసాగలేనని ఆయన తేల్చిచెప్పారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే టీడీపీతో టచ్ లోకి వెళ్లిన ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.







