తప్పుడు అటెస్టేషన్ .. సింగపూర్‌లో భారత సంతతి న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు

తప్పుడు అటెస్టేషన్ (ధృవీకరణ)( Falsely attesting documents ) నేరానికి గాను సింగపూర్‌లో భారత సంతతికి చెందిన న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు పడింది.తన సమక్షంలో సంతకం చేయనప్పటికీ, ఆస్తికి సంబంధించిన పలు పత్రాలపై సంతకం చేయడాన్ని తాను చూశానని ఆమె ధృవీకరించాడు.

 Indian-origin Singapore Lawyer Suspended For Falsely Attesting Documents , Indi-TeluguStop.com

ఇందుకు గాను సింగపూర్‌లోని లా సొసైటీ .నిందితురాలు కస్తూరీబాయి మాణిక్కమ్‌పై 30 నెలల సస్పెన్షన్‌ను విధించింది.25 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో వున్న ఆమె.కండోమినియం యూనిట్‌లో రిజిస్టర్డ్ ఓనర్‌గా ఇద్దరు తోబుట్టువుల కోసం ఈ పని చేశారు.

సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్( Sundaresh Menon ) నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం .పాత్ర లోపం కంటే తీర్పు తీవ్రమైన లోపమని ఉదహరించింది.పత్రాలపై ఉద్దేశించిన సంతకాలు చేశారనే విషయంలో ఎలాంటి వివాదం లేదని జస్టిస్ మీనన్ వ్యాఖ్యానించారు.కస్తూరీబాయి చేసిన తప్పిదమేంటంటే.ఆమెకు పార్టీలిద్దరూ తెలుసునని, ఎలాంటి ఇబ్బందులు వుండవని భావించిన తర్వాతే సాక్షిగా ధృవీకరించాలని నిర్ణయించుకుందని జస్టిస్ మీనన్ పేర్కొన్నారు.

Telugu Sundaresh Menon, Indian Origin, Santhadevi, Singapore-Telugu NRI

శాంతా దేవీ వీ పూతేంవీటిల్ కేశవ పిళ్లై( Santha Devi V Puthenveetil Kesava Pillay ), ఆమె సోదరుడు రామన్ పూతేంవీటిల్ కేశవ పిళ్లైలు సెస్టెంబర్ 2020లో ఇద్దరు వ్యక్తులకు ఆస్తిని విక్రయించారు.కస్తూరీబాయికి చెందిన ఈస్ట్ ఆసియా లా కార్పోరేషన్.ఆస్తి అమ్మకానికి ముందు పలు విషయాలలో సదరు తోబుట్టువుల కోసం పనిచేసింది.

రామన్ భార్య కూడా కస్తూరీబాయి సంస్థలోనే పనిచేస్తున్నారు.దీంతో వారి కోసం కస్తూరీబాయి ఆరు పత్రాలను సిద్ధం చేయగా వీటిపై శాంతాదేవి సంతకం చేసింది.

సెప్టెంబర్ 7, 2020 నుంచి నవంబర్ 5, 2020 మధ్య సంతకం చేయనప్పటికీ శాంతాదేవి సంతకంపై కస్తూరీబాయి సాక్షిగా ధృవీకరణ చేశారు.

Telugu Sundaresh Menon, Indian Origin, Santhadevi, Singapore-Telugu NRI

ఈ క్రమంలో కస్తూరీబాయిపై శాంతాదేవి సింగపూర్ లోని లా సొసైటీకి ఫిర్యాదు చేసింది.ఈ వ్యవహారంపై అధికారికంగా దర్యాప్తు చేయడానికి 2022 మేలో క్రమశిక్షణా ట్రిబ్యునల్‌ని నియమించారు.అక్టోబర్ 2022లో జారీ చేసిన ట్రిబ్యునల్ నివేదిక ఫిర్యాదుకు దారితీసిన పరిస్ధితులను మాత్రం వివరించలేదు.

ట్రిబ్యునల్ విచారణలో కస్తూరీబాయి తన నేరాన్ని అంగీకరించింది.ఆమె తరపున సీనియర్ న్యాయవాది ఎన్ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు.

కస్తూరీబాయి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరించలేదని, కోవిడ్ సమయంలో తన వృద్ధ ఖాతాదారులకు సహాయపడేందుకు ఇలా చేశారని వాదించారు.లావాదేవీ చట్టబద్ధమైనదే అయినందున చాలా తక్కువ నష్టం జరిగిందని శ్రీనివాసన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube