త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం (Guntur curry)సినిమా ప్రేక్షకులను కొద్ది వరకు డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ గాని ఆయనే రైటింగ్ స్టైల్ గాని ఏదీ లేకపోవడంతో అభిమానులు భారీగా నిరాశ పడినట్టుగా తెలుస్తుంది.
నిజానికి ఈ సినిమాలో ప్రేక్షకుడు కోరుకున్న కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో ఈ సినిమా మీద విమర్శలు వస్తున్నాయి.ఇక ఇలాంటి సినిమాలకి ఇప్పుడు కాలం చెల్లిపోయింది.
కొత్త కథలతో సినిమాలు చేయవచ్చు కదా అంటూ విమర్శకులు సైతం ఈ సినిమా పైన త్రివిక్రమ్ పైన విమర్శలు చేస్తున్నారు.
త్రివిక్రమ్ తలుచుకుంటే ఒక మంచి కథ రాసి మంచి సినిమా చేయగలరు కానీ ఎందుకు ఆయన గుంటూరు కారం విషయంలో అలా వ్యవహరించారో ఎవరికి తెలియడం లేదు.మరి ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినప్పటికీ సక్సెస్ పరంగా సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మహేష్ బాబు(Mahesh Babu) మాత్రం ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు రెండు సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది.నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా డిలే అవుతు వచ్చింది.
ఇక ఎట్టకేలకు సంక్రాంతి(Sankranti) కానుకగా ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక మహేష్ బాబు ఇంతకు ముందు చేసిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) అవరేజ్ టాక్ ను సంపాదించుకుంది.మరి ఈ సినిమా లాంగ్ రన్ మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంది…
.