నా భార్య గురించి నీచంగా అలాంటి కామెంట్లు చేశారు.. అమర్ దీప్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో రన్నర్ గా నిలిచి అమర్ దీప్( Amardeep ) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.అమర్ దీప్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

 Bigg Boss Amardeep Shocking Comments Goes Viral In Social Media Details, Amardee-TeluguStop.com

తాజాగా అమర్ దీప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కోవాలని సూచించారని తెలిపారు.

ఆ సమయంలో నేను ఎందుకు దాక్కోవాలో అర్థం కాలేదని నేను ఏం తప్పు చేశానని అనుకుంటూ కారు స్టార్ట్ అయ్యామని అమర్ దీప్ పేర్కొన్నారు.

కారు బయటకు రాగానే చాలామంది నా కారు చుట్టూ ఫోన్ లైట్ ఆన్ చేశారని నేను కనిపించిన వెంటనే బూతులు తిట్టడం మొదలుపెట్టారని అన్నారు.

రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారని అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అన్నారని అలాంటి మాటలు తల్లి పక్కన కూర్చుని ఏ కొడుకు వినలేడని అమర్ దీప్ చెప్పుకొచ్చారు.వాళ్ల కోపం నాపై కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపిందని అమర్ కామెంట్లు చేశారు.

Telugu Amardeep, Amardeepcar, Amardeep Mother, Bigg Boss-Movie

ఆ సమయంలో ఆ తిట్లను నేను భరించలేకపోయానని వెల్లడించారు.కొంతమంది అయితే నా భార్యను( Amardeep Wife ) తీసుకెళ్తామంటూ అసభ్యంగా మాట్లాడారని అమర్ దీప్ అన్నారు.నేను కేసులు పెట్టగలను కానీ వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయని ఆలోచించానని అమర్ దీప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.హౌస్ లో కొంతమంది నన్ను పదేపదే తిట్టినా ఓర్చుకున్నానని అమర్ దీప్ కామెంట్లు చేశారు.

Telugu Amardeep, Amardeepcar, Amardeep Mother, Bigg Boss-Movie

బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss House ) ఉన్న సమయంలో నేను నిజాయితీగానే మాట్లాడానని బ్యాక్ బిచింగ్ చేయలేదని అమర్ దీప్ చెప్పుకొచ్చారు. అమర్ దీప్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అమర్ దీప్ తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube