మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు..స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ..!!

మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకుంది.శివసేన పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు వచ్చింది.

 Complaint Of Disqualification Against Shiv Sena Mlas In Maharashtra..excitement-TeluguStop.com

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకల్ తీర్పును ప్రకటిస్తున్నారు.

ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పును ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా స్పీకర్ రాహుల్ నార్వేకల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని తెలిపారు.అయితే గత సంవత్సరం ఉద్ధవ్ థాక్రే వర్గంపై షిండే తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.

తరువాత ఆయన వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్ధతు ప్రకటించడంతో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది.దీంతో షిండే సీఎంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో షిండే సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని థాక్రే వర్గం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.అలాగు తమదే నిజమైన శివసేన అని చెబుతూ షిండే వర్గం కూడా కంప్లైంట్ చేసింది.

రెండు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ నిర్ణయంపై ఇవాళ తుది గడువు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube