అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా ఈమె నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈమె నటించడం మొదటి సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు అందరి సరసన నటించి లావణ్య త్రిపాఠి మెప్పించారు.
ఇక ఈమె మెగా కాంపౌండ్ లో అల్లు శిరీష్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ వంటి హీరోల సరసన నటించారు అయితే ఈమె వరుణ్ తో కలిసి మిస్టర్ సినిమా అంతరిక్షం అనే రెండు సినిమాలలో నటించారు.ఈ సినిమాల సమయంలోనే ఈమె ఆయనతో ప్రేమలో పడటం వీరి ప్రేమ ప్రయాణాన్ని రహస్యంగా కొనసాగించడం జరిగింది ఇలా కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా ఇటలీలో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత హనీమూన్ వెకేషన్ అన్ని పూర్తి చేసుకున్న అనంతరం వరుణ్ సందేశ్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈయన ప్రస్తుతం మట్కా ( Matka ) సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దీంతో వరుణ్ తేజ్( Varun Tej ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా లావణ్య త్రిపాఠి మాత్రం తన పుట్టింటికి వెళ్ళిపోయారు.
ఈమె ప్రస్తుతం డెహ్రాడూన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తన పెట్ డాగ్ ( Pet dog )తో కలిసి ఈమె వర్క్ అవుట్ చేయడం ఎక్కడికి వెళ్లినా దానిని వెంట పెట్టుకొని వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాము.అయితే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసినటువంటి స్టోరీ ప్రస్తుతం వైరల్ గా మారింది.
లావణ్య త్రిపాటి డెహ్రాడూన్( Dehradun ) లో పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రతిసారి తనతో పాటు తన పెట్ డాగ్ ను తీసుకువెళ్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తనతో కలిసి వెళుతున్నటువంటి ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.మీ అండ్ మై గర్ల్ అంటూ లవ్ సింబల్ తో ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.ఇక ఈ వీడియో పై పలువురు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
లావణ్య తన భర్తను పక్కన పెట్టేసి పూర్తిగా తన పెట్ డాగ్ తో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే వరుణ్ తేజ్ మాత్రం సినిమా షూటింగ్ పనులలో విదేశాలలో ఉన్న సంగతి తెలిసిందే.