ప్రస్తుతం చలికాలం( Winter ) కొనసాగుతుంది.రోజురోజుకు చలి పులి విజృంభిస్తోంది.
అయితే ఈ సీజన్ లో చలి కారణంగా చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు.కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అలసట, చిరాకు వంటివి విపరీతంగా పెరుగుతాయి.అందువల్ల ఈ చలికాలంలో హాయిగా ప్రశాంతంగా నిద్ర పోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను కచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోండి.
ఈ డ్రింక్ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఐదు నుంచి ఐదు ఫ్రెష్ తులసి ఆకులు( Tulasi Leafs ) వేసుకోవాలి.అలాగే అర అంగుళం దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు ( Turmeric )కొమ్ము తురుము, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి మరిగించండి.
దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.తద్వారా మన డ్రింక్ సిద్ధమవుతుంది.
ప్రస్తుత చలికాలంలో ప్రతి రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ తీసుకోవాలి.ఇది మీ శరీరానికి మంచి వెచ్చదనాన్ని అందిస్తుంది.చలిని తట్టుకునే సామర్థ్యాన్ని చేకూరుస్తుంది.అలాగే నిద్రను ప్రమోట్ చేసే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.దాంతో మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు.పైగా ఈ వండర్ ఫుల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి వెయిట్ లాస్ అవుతారు.
మన బాడీలో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.అంతేకాదు, ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్‌ను తాగితే.
దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉన్నా కూడా దూరం అవుతాయి.