ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో( Indigo ) తాజాగా కాళ్లకు ఎక్కువ స్థలం అందించే ముందు వరుస సీట్ల ధరలను పెంచింది.కొత్త ధరలు 222 సీట్లతో ఉన్న A321 విమానాలకు( A321 aircrafts ) వర్తిస్తాయి, ఆ ప్రైసెస్ ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.ముందు వరుసలో కిటికీ లేదా అయిల్ సీటు కావాలంటే రూ.2000 ఎక్స్‌ట్రాగా చెల్లించాలి.అదే వరుసలో అయిల్ సీటు కావాలంటే రూ.1500 అదనంగా చెల్లించాలి.

రెండు, మూడో వరుసల్లోని సీట్లకు రూ.400 అదనంగా ఉంటాయి.మీరు ప్రత్యేక సీటు కోసం చెల్లించకూడదనుకుంటే, ఏదైనా ఉచిత సీటును ఎంచుకోవచ్చు లేదా చెక్ ఇన్ చేసినప్పుడు విమానాశ్రయంలో ఒకదాన్ని ఉచితంగా పొందవచ్చు.ఇండిగో ఎయిర్‌లైన్ వెబ్‌సైట్( Indigo Airline ) ప్రకారం, 180 సీట్లతో కూడిన A320 విమానాల ధరలు ఇవే.ఆన్‌లైన్‌లో చాలా మందికి ఈ వార్త నచ్చలేదు, వారు ఎయిర్‌లైన్ నిర్ణయంపై మండిపడ్డారు.

కొంతమంది తమ కోపాన్ని వ్యక్తం చేయడానికి ఫన్నీగా కామెంట్లు చేసారు.విమానాల్లో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ప్రజలు డబ్బు చెల్లించేలా ఎయిర్‌లైన్స్ చర్యలు తీసుకోవాలని వారు సెటైర్ పేల్చారు.ఎయిర్‌లైన్స్ బాత్రూమ్ డోర్‌పై కూడా మెషిన్‌ను పెట్టాలని, లోపలికి వెళ్లేందుకు ప్రజలు కార్డులతో మనీ చెల్లించేలా ఒక సిస్టమ్ తీసుకో రావాలని మరికొందరు ఫన్నీగా దానికి సలహా ఇచ్చారు.“ఉచితంగా లభించే సీట్లు భవిష్యత్తులో ఎంతకు ఘోరంగా తయారవుతాయో” అని మరికొందరు అన్నారు.ఈ విమానయాన సంస్థ మరుగుదొడ్డి, సీటు పైన లైట్, టిష్యూలు, కూర్చోవడానికి మెత్తగా ఉండే సీట్లు, ఊపిరి పీల్చుకోవడం వంటి వాటి కోసం కూడా ప్రజలు డబ్బు చెల్లించేలా చేస్తుందని ఒక నెటిజన్ తన కోపాన్ని వ్యక్తం చేశారు.
ఇండిగో ఇకపై చౌక విమానయాన సంస్థ అని చెప్పకూడదని ఇంకొందరు అన్నారు.







