తెలంగాణలో బీఆర్ఎస్ నేతలను ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సచివాలయానికి ప్రజలు వస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని తెలిపారు.
డేటా ఎంట్రీ పూర్తికాక ముందే ఎందుకు అంత తొందర అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోని వారు ఎమ్మార్వో కార్యాలయాల్లో చేసుకోవచ్చని చెప్పారు.
గత ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్ మెంట్ లో డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని ఆరోపించారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన సూచించారు.







