ప్రస్తుతం సంక్రాంతి సినిమాల( Sankranti movies ) మీద అందరి దృష్టి ఉంది.ఇప్పటికే ఈ సినిమాల మీద మంచి హైప్ క్రియేట్ చేసుకొని థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి సినిమాల రేస్ లో మన స్టార్ హీరోలు సైతం పోటీ పడుతుండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే చెప్పాలి.

సంక్రాంతికి ఇంతకు ముందు ఎన్నడు కూడా ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడలేదు ఇక ఇప్పుడు ఇది మొదటిసారి జరుగుతుంది.కాబట్టి ఈ సమరంలో ఏ స్టార్ హీరో విజయం సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక స్టార్ హీరో సినిమాలతో పాటుగా హనుమాన్( Hanuman ) అనే చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
అయితే ఇది చిన్న సినిమా అయినప్పటికీ ఇందులో వాడిన గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ సినిమాతో యంగ్ హీరో అయిన తేజ సజ్జా( Teja Sajja ) కి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి( Director Prashanth Verma ) మంచి సక్సెస్ అందుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

నిజానికి ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ కొడితే అటు హీరో కి ఇటు డైరెక్టర్ కి ఇద్దరికీ కూడా మంచి హెల్ప్ అవుతుందనే చెప్పాలి.ఇక ఈ సంక్రాంతి కి ఏ సినిమా తన పంజా విసురుతుందో చూడాలి…ఇక అలాగే నాలుగు సినిమాలు చూడటానికి జనాలు తెగ ఆరాటపడుతున్నారు.ఇక దాంట్లో భాగం గానే ఈ సినిమాలు భారీ సక్సెస్ సాధించే దిశ గా ముందుకు కదులుతున్నాయి.మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, తేజ సజ్జా వీరిలో ఈ సంక్రాంతి కి ఎవరు గెలుస్తారో చూడాలి.








