సినిమాలు ఎప్పుడూ దర్శకుడు మొదటగా ప్లాన్ చేసిన విధంగా కంప్లీట్ అవ్వవు.కథ మారొచ్చు, హీరోయిన్ మారచ్చు, లేదంటే ఏకంగా హీరోనే చేంజ్ అవ్వచ్చు.
హీరో చేంజ్ అవ్వడానికి చాలానే కారణాలు ఉంటాయి.ఉదాహరణకి హీరోకి కథ నచ్చకపోవచ్చు.
లేదంటే తాను ఆ సినిమా చేయలేనని అనుకోవచ్చు.డేట్స్ కుదరకపోవచ్చు, ఇంకా సినిమా చేయకపోవడానికి వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చు.
అయితే హీరోలు ఒక్కోసారి తాము చేయలేమని ఒక సినిమాని రిజెక్ట్ చేయడమే కాక ఆ సినిమాకి ఎవరు బాగా సూట్ అవుతారో కూడా చెప్పగలరు.అలా చెప్పిన వారిలో మహేష్ బాబు( Mahesh Babu ) కూడా ఉన్నాడు.
అతను తన వద్దకు వచ్చిన డార్లింగ్ సినిమా( Darling movie ) స్టోరీని బాగా లైక్ చేశాడు కానీ ఆ పాత్రకు తాను సూట్ అవ్వను అని డైరెక్టర్ కి నేరుగా చెప్పాడు.

ఆ తర్వాత డార్లింగ్ హీరో రోల్ కి ప్రభాస్ ( Prabhas )కరెక్ట్ గా సూట్ అవుతాడని సూచించాడు.డైరెక్టర్ ఎ.కరుణాకరన్( Director A.Karunakaran ) కూడా మహేష్ బాబుతో అంగీకరించి ప్రభాస్ ని సంప్రదించాడు.యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి కూడా ఆ సినిమా katha బాగా నచ్చేసింది.
ఆ పాత్ర తాను బాగా చేయగలను అనే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పేసాడు.అంతకుముందే మహేష్ ప్రభాస్ కి ఈ సినిమా గురించి చెప్పాడట.దాంతో ఈ కథను అతడు మిస్ కాకుండా విన్నాడు, ఇందులో చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నలను పొందాడు.

సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.ఈ మూవీలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.కొత్త హెయిర్ స్టైలుతో స్మార్ట్ గా కనిపించి అమ్మాయిల హృదయాలను దోచేశాడు.నిజానికి ఈ సినిమా తీసిన తర్వాతే అతడిని అమ్మాయిలు డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టారు.ఈ సినిమాలో కాజల్ కూడా చాలా బాగా నటించింది.
ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఈ మూవీకే పెద్ద హైలైట్ అయ్యాయి.కామెడీ కూడా బాగానే వర్క్ ఔట్ అయ్యింది.
పాటలు కూడా మనసును హత్తుకునేలా ఉంటాయి.మొత్తం మీద ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.







