సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న ప్రభాస్ ( Prabhas )ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు అందరిని భయపెడుతున్నాడు ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఒక సౌత్ హీరోని చూసి భయపడడం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి.ఈ విషయం లో మనం ప్రభాస్ ని తప్పకుండా మెచ్చుకోవాలి బాహుబలి సినిమాతో తనకంటూ ఒక రేంజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమాతో అంతకుమించి అనేలా సూపర్ డూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.

ఇక బాలీవుడ్( Bollywood ) లో ఖాన్ త్రయం వాళ్లే తోపులు అని ఫీల్ అయిపోతూ ఉంటారు.అలాంటి వాళ్ళని సైతం భయంతో వణికిస్తున్న ఒకే ఒక్కడు ప్రభాస్ ఈయన నటించిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి చాటి చెప్పాడు.ఇక తెలుగు వాళ్లని చిన్నచూపు చూసే బాలీవుడ్ మాఫియా కి సైతం వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఒకే ఒక్కడు ప్రభాస్ ఇక తను నెక్స్ట్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో చేయబోయే కల్కి సినిమా( Kalki movie ) మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ప్రభాస్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరో గా గుర్తింపు పొందుతాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పూర్తవడంతో మిగిలిన బ్యాలెన్స్ కూడా నాగ్ అశ్విన్ తొందరగా ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు.ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రావాల్సిన స్పిరిట్ సినిమా కూడా భారీ రేంజ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో…








