తమిళ్ స్టార్ హీరో విజయకాంత్( Vijayakanth ) న్యుమోనియాతో బాధపడుతూ 2023, డిసెంబర్ 28న 71 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.ఆయన మరణం చాలా మందిని బాధించింది.
ఎంతోమంది విజయకాంత్ తమకు చేసిన పరోపకారాలను గుర్తు చేసుకుంటూ మరీ ఏడ్చేశారు.వీరిలో రజనీకాంత్ కూడా ఉన్నారు.
ఇలాంటి పనుల వల్లే కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయకాంత్.మంచి మనస్తత్వంతో ఎంతోమంది అభిమానులకు దగ్గరైన ఈ హీరో ఇక లేడనే వార్త చాలామందిని మానసికంగా డిస్టర్బ్ చేస్తుంది.

విజయకాంత్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే.ఆయన నటించిన చాలా యాక్షన్ సినిమాలు తెలుగులో డబ్ అయి అలరించాయి.ఈ హీరో లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో కూడా కలిసి నటించాడు.నిజానికి ఆమె ఇప్పటికీ ప్రాణాలతో ఉండడానికి ఆయనే కారణం.విజయకాంత్ తనని ఎలా కాపాడాడో స్వయంగా విజయశాంతి( Vijayashanti ) ఓ సందర్భంలో తెలిపింది.విజయకాంత్ మరణం తర్వాత మళ్లీ ఈ సంఘటన గురించి ఆమె గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది.
ఆమె మాట్లాడుతూ 1980లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నామని, ఒక సన్నివేశంలో భాగంగా తనను ఒక తోటలో కట్టేసి చుట్టూ మంట అంటించారని చెప్పింది.అయితే ఒక్కసారిగా పెద్ద గాలి రావడంతో మూవీ మేకర్స్ ఊహించని విధంగా మంటలు ఆ ప్రాంతమంతా చుట్టేసాయట.

దాంతో కట్టేసిన ఆమె వద్దకు రావడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారట.ఆ మంటల్లోకి వెళ్లితే చనిపోవడం ఖాయమని వెనక్కి తగ్గారట.ఆ సమయానికి నీళ్లు కూడా లేవట.అయితే ఈ విషయం తెలిసిన విజయకాంత్ వెంటనే మంటల్లో నుంచి పరిగెడుతూ చివరికి విజయశాంతిని చేరుకున్నాడట.అనంతరం అతి కష్టం మీద ఆమె కట్లు విప్పేసి అక్కడి నుంచి సురక్షితంగా బయటికి తరలించాడట.లేకపోతే అదే ప్రమాదంలో తన ప్రాణాలు పోయి ఉండేవని, ఆయన తన ప్రాణాలను అడ్డేసి తన జీవితాన్ని కాపాడాడని తాజాగా విజయశాంతి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.
అతడి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.ఆయన ఎప్పటికీ ప్రజల హీరో అంటూ కొనియాడింది.
ఈ సంగతి తెలుసుకున్న అభిమానులు విజయ్ కాంత్ ను మరింత పొగుడుతున్నారు.ఆయన ధైర్య సాహసాలు, కరుణ, పరోపకార మనస్తత్వాన్ని హాట్సాఫ్ చెబుతున్నారు.







